ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
NTR: విజయవాడ 14వ డివిజన్ ఎన్టీఆర్ సర్కిల్ కృష్ణవేణి స్కూల్ రోడ్డు అంగన్వాడి కేంద్రం ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గురువారం పర్యటించారు. అనంతరం ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయుష్ హాస్పటల్ సహకారంతో అంగన్వాడి స్కూల్‌లో టాయిలెట్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.