ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: ఐ.పోలవరం మండలం మురమళ్ళ బైర్రాజు ఫౌండేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత దంత వైద్య శిబిరాన్ని శనివారం ఎమ్మెల్యే సుబ్బరాజు ప్రారంభించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి రోగులకు అందిస్తున్న వివిధ చికిత్సల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వైద్య శిబిరాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకుని మెరుగైన వైద్యాన్ని పొందాలని కోరారు.