రైతులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం

రైతులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం

ASR: కూటమి ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి, వైసీపీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ తదితరులు ఆరోపించారు. అనంతగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో అందించాల్సిన యూరియా డీఎపీ వంటి వాటి సరఫరాలో డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేకపోతుందని విమర్శించారు.