శాతవాహన ఆచార్యునికి బెస్ట్ టీచర్ అవార్డు

KNR: రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను, ఆచార్యులను 2022-23 సంవత్సరానికి అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా శాతవాహన విశ్వవిద్యాలయ ఉర్దూ విభాగ సహాయ ఆచార్యులు డా. నజీముద్దీన్ మునావర్ ఎంపిక చేసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు.