మస్కట్ నుంచి తిరిగి వచ్చిన వలస కూలీలు

మస్కట్ నుంచి తిరిగి వచ్చిన వలస కూలీలు

SKLM: కేంద్ర విమాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో స్వదేశానికి 9 మంది వలస కూలీలు శుక్రవారం చేరుకున్నారు. ఇచ్ఛాపురానికి చెందిన యువకులు ఉపాధికి మస్కట్ వెళ్లి ఇబ్బందులకు గురయ్యారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి సమస్యను తెలిపారు. అనంతరం రామ్మోహనాయుడు ఆ దేశ విదేశాంగ మంత్రి‌తో మాట్లాడడంతో వారు సొంత ఊరికి చేరారు.