గొప్ప మనసు చాటుకున్న ఐకాన్ స్టార్

గొప్ప మనసు చాటుకున్న ఐకాన్ స్టార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఉదారతతో రియల్ హీరో అనిపించుకున్నాడు. ఏపీలోని కాకినాడ జిల్లా బాణసంచా పేలుళ్లలో తండ్రిని కోల్పోయి అనాథగా మారిన మానసిక దివ్యాంగురాలు దుర్గకు ఆయన అండగా నిలిచాడు. ఆమె పోషణ కోసం జీవితాంతం నెలకు రూ.7,500 ఆర్థిక సాయం చేస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తాజాగా మొదటి నెల నగదును ఆమె ఖాతాలో జమ చేసి, తన మానవత్వాన్ని చాటుకున్నాడు.