కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
కృష్ణా: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. అలాగే, 2013లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కావూరి మరణంతో రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది.