పిడుగుపాటుకు యువకుడి మృతి

కృష్ణా: ఘంటసాల మండలం శ్రీకాకుళం వద్ద ఉన్న కృష్ణానదిలో ఆదివారం పిడుగుపాటుకు యువకుడు మృతి చెందాడు. మొవ్వ మండలం కోసూరుకు చెందిన మాతంగి సుప్రదీప్ తన స్నేహితుడితో కలిసి గాజుల్లంక వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సుప్రదీప్ అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.