VIDEO: ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన కలెక్టర్
ELR: దివ్యాంగులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద ఆమె బుధవారం ప్రారంభించారు. అనంతరం సత్యనారాయణపురం నుంచి ఏలూరు వరకు వారితో కలిసి ప్రయాణించారు. మార్గంలో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.