శక్తి టీంపై అవగాహన కల్పించిన సీఐ

VZM: ఎస్. కోట పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయులతో శక్తి టీం, వారియర్స్ బృందాలపై సీఐ నారాయణమూర్తి, MEO లతో కల్సి మంగళవారం అవగాహన కల్పించారు. మహిళలు, ఆడపిల్లలకు భౌతికంగానే కాకుండా సోషల్ మీడియా ద్వారా వేదింపులకు గురయ్యే విషయాలను ఇంటిలో, బయట శక్తి టీం ద్వారా సమస్యలు తెలియజేసి, పరిష్కారం పొందాలని సూచించారు. 7993485111 అందుబాటులో ఉందన్నారు.