పెంచలయ్య హత్య కేసులో లేడీ డాన్ అరెస్ట్
NLR: CPI కార్యకర్త పెంచలయ్య హత్య కేసులో నిందితురాలు లేడీ డాన్ కామాక్షిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. బోడిగానితోటలోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించి, 25 KGల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయికి వ్యతిరేకంగా, పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పెంచలయ్య పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 9 మంది కత్తులతో పొడిచి హత్య చేయించినట్లు అరోపణలు ఉండడంతో కామాక్షిని అదుపులోకి తీసుకున్నారు.