కుష్టు వ్యాధిపై విద్యార్థులకు అవగాహన

కుష్టు వ్యాధిపై విద్యార్థులకు అవగాహన

NTR: గంపలగూడెం మండలం పెనుగొలనులో శనివారం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించారు. ఒంటిపై స్పర్శ లేని రాగి లేదా గోధుమ రంగు మచ్చలు ఉంటే వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు. నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ సుల్తానా, పుల్లారావు, రత్నమాల తదితరులు పాల్గొన్నారు.