800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

CTR: పుంగనూరు రూరల్ పరిధిలో ఎక్సైజ్ పోలీసులు గురువారం దాడులు చేపట్టారు. మండల పరిధిలోని జువ్వలదిన్నె తాండ పరిసరాల్లో నాటు సారా తయారీకి ఉపయోగించే 800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సురేశ్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ దాడులు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.