నల్లమల్ల అటవీప్రాంతంలో కార్చిచ్చు
నంద్యాల జిల్లా మహానంది పరిధిలోని నల్లమల అడవిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆలయం వెనుక ఉన్న అడవిలో కార్చిచ్చు అంటుకోవడంతో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అటవీ, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పేందుకు శ్రమిస్తున్నారు.