'విద్యుత్తు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి'
NLG: విద్యుత్తు సమస్యల పరిష్కారానికి నిరంతర విద్యుత్తు సరఫరా కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. చింతపల్లి మండలంలోని కుర్మేడ్ గ్రామంలో రూ. 1.91 కోట్ల వ్యయంతో నిర్మించబోయే 33/11కేవీ నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు సంబంధిత అధికారులతో కలిసి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు.