నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

MBNR: స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తిరిగి యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రజలు గమనించి ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావద్దని ఆమె సూచించారు.