సమయం లేదు మిత్రమా.. ఓటేద్దాం పదండి!
KMR: జిల్లాల్లో GP ఎన్నికల పోలింగ్ అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే, పోలింగ్ సమయం ముగింపు దశకు చేరుకుంది. మరో 30 నిమిషాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. సమయం ముగియగానే పోలింగ్ కేంద్రాల గేట్లు మూసివేయనున్నారు. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉంది.