‘మంగ్లీ అక్క.. తప్పు చేశా, క్షమించు’

‘మంగ్లీ అక్క.. తప్పు చేశా, క్షమించు’

తన ‘బాయిలోనే బల్లి పలికే’ పాటపై ఓ వ్యక్తి అసభ్యకర కామెంట్స్ చేయడంతో సింగర్ మంగ్లీ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే నిందితుడు ‘నన్ను  క్షమించు మంగ్లీ అక్క, మరో సారి ఇలా కించపరిచే కామెంట్స్ చేయను’ అంటూ వీడియో ద్వారా క్షమాపణలు కోరాడు.