నగరంలో జోరుగా 'హుష్- డేటింగ్'
హైదరాబాద్‌లో 'హుష్-డేటింగ్' అనే కొత్త సీక్రెట్ ట్రెండ్ జోరుగా ఉంది. తల్లిదండ్రుల నిఘా, ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో యువతీయువకులు గోప్యంగా ఆన్‌లైన్ డేటింగ్ ప్రొఫైల్స్ నిర్వహిస్తున్నారు. ఇంట్లో తెలియకుండా వీరు కేవలం గ్రూప్ చాట్స్‌లో మాత్రమే గుసగుసలాడుకుంటున్నారు. వీరు కలుసుకునేందుకు గచ్చిబౌలి, మాదాపూర్ వంటి దూర ప్రాంతాల్లోని పబ్లిక్ కాఫీ షాప్లను ఎంచుకుంటున్నారు.