విగ్రహ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే
కృష్ణా: పెదపారుపూడి మండలం కొర్నిపాడులో డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మిల్క్ యూనియన్ విజయడైరి డైరెక్టర్ చలసాని చక్రపాణి, కూటమి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.