'నాలుగు లేబర్ చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం ఆగదు'

SRD: కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు అన్నారు. సదాశివపేటలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని చెప్పారు. కార్మికులు పోరాటం చేసి సాధించుకునే హక్కును రద్దు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.