'పనులను త్వరితగతిన పూర్తి చేయాలి'
ASR: జిల్లాలో మొబైల్ సిగ్నల్ మెరుగుదలకు అనుమతులు పొందిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ నిశాంతి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వీసీలో టెలికాం ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ అత్యవసరమని పేర్కొన్నారు. అలాగే, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు.