డ్రైవింగ్‌లో తప్పులు చేస్తే టెస్ట్ రాయాల్సిందే!

డ్రైవింగ్‌లో తప్పులు చేస్తే టెస్ట్ రాయాల్సిందే!

డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ విధానంలో కేంద్రం కీలక మార్పులు చేస్తోంది. గతంలో ఎలాంటి పరీక్షలు లేకుండానే లైసెన్స్ పొడిగించేవారు. కానీ, కొత్త నిబంధనల ప్రకారం.. ట్రాఫిక్ ఉల్లంఘనల రికార్డు ఉన్నవారు లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలంటే మళ్లీ డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావాల్సిందే. బాధ్యతాయుతమైన డ్రైవర్లను మాత్రమే రోడ్లపై ఉంచేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.