మూవీలు చేయొద్దన్న నెటిజన్.. రిప్లై ఇచ్చిన నటుడు
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి నటించిన 'ప్రేమంటే' సినిమా ఇవాళ విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రియదర్శి.. అభిమానులతో చిట్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. 'అన్నా నువ్వు సినిమాలు చేయడం ఆపేయ్ ప్లీజ్' అని పోస్ట్ పెట్టాడు. దీనికి ప్రియదర్శి.. 'మరి ఏం చేయమంటావ్?.. గడ్డి పీకమంటావా?' అంటూ తన స్టైల్‌లో రిప్లై ఇచ్చాడు.