అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం

PDPL: రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ 27వ డివిజన్ గాంధీ నగర్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాయి. సుమారు రూ. 5 లక్షల వ్యయంతో గాంధీ నగర్, మనో చైతన్య కేంద్రం ఎదురుగా ఉన్న వీధిలో నిర్మాణ పనులు ప్రారంభించారు. చాలా కాలం నాటి సమస్య పరిష్కారం కావడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.