బీజేపీ కుట్రలను భగ్నం చేశాం: స్టాలిన్

బీజేపీ కుట్రలను భగ్నం చేశాం: స్టాలిన్

తమిళనాడు ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. యూపీ, మణిపుర్‌ తరహాలో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం ఆ కుట్రలను భగ్నం చేసిందని తిరుచ్చి సభలో పేర్కొన్నారు. డీఎంకే గెలిస్తే మహిళలకు రూ.8,000 గృహోపకరణాల కూపన్, నెలకు రూ.2,000 ఆర్థిక సాయం, విద్యార్థులకు రూ.1,500 ఇస్తామని హామీలిచ్చారు.