మెడికల్ కాలేజీల్లో PPP విధానం వద్దు: తులసి రెడ్డి
TPT: వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 10ని ప్రైవేటీకరించడం దారుణమన్నారు. అనంతరం కేవలం రూ.6 వేల కోట్లు ఉంటే వాటి పనులు పూర్తవుతాయన్నారు.