KGBVల్లో ఇంటర్ ప్రవేశాలకు నేటి నుంచే దరఖాస్తులు
VKB: తెలంగాణలోని 93 కేజీబీవీ (KGBV) పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు TGRJC CET పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ. 200గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్ష మే 3న నిర్వహించనున్నారు.