VIDEO: ఉప్పాడ తీరంలో అలలు బీభత్సం

KKD: ఉప్పాడ తీరంలో సముద్రపు అలలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీటి తాకిడికి తీరప్రాంత రహదారులు, నిర్మాణాలు ధ్వంసమై కనుమరుగయ్యాయి. సుమారు వెయ్యి ఎకరాల భూమి, గ్రామాలు, ఆలయాలు, గెస్ట్ హౌస్‌లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న మూడవ రోడ్డు కూడా కోతకు గురవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కలెక్టర్ రక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.