BIG BREAKING: దాడులు ఆపేస్తామన్న ఇరాన్
ఇరుగుపొరుగు దేశాలపై తాము దాడులు చేయబోమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలకు ఆయా దేశాలకు క్షమాపణలు చెప్పారు. 'మా జోలికి రాకుంటే.. మీ జోలికి రాబోము' అని భరోసా ఇచ్చారు. అయితే.. ఇజ్రాయెల్, US ముందు తలవంచే ప్రసక్తే లేదని, వారి బెదిరింపులకు లొంగబోమని కరాఖండిగా చెప్పారు. ఈ ప్రకటనతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు తగ్గుతాయేమో చూడాలి.