VIDEO: 'వైభవంగా శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమం'

ADB: తలమడుగు మండల కేంద్రంలో శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమం సోమవారం వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం నిర్వహించిన భజన సంకీర్తన, సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.