తాను మరణిస్తూ.. ఐదుగురికి పునర్జన్మ..!
GNTR: తాను మరణిస్తూ ఐదుగురికి అవయదానం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘటన భట్టిప్రోలులో చోటు చేసుకుంది. 65 ఏళ్ల రత్నకుమారి బ్రెయిన్ స్ట్రోక్‌తో గుంటూరులోని ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆమెను బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించడంతో, కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. జీవన్ దాన్ పథకం ద్వారా ఆమె కిడ్నీలు, లివర్, కళ్లను దానం చేశారు.