VIDEO: వైభవంగా సత్తెమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు
కోనసీమ: అయినవిల్లి మండలం క్రాప గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణం అంతా ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు.