'ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అర్హులకు అన్యాయం'
NLG: చిట్యాల మండలం వెంబావి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు, గ్రామస్థాయి నాయకులు కుమ్మక్కై, పూరి గుడిసెల్లో ఉండేవారిని కాదని అధికార పార్టీ వారికే ఇళ్లు కేటాయిస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని సర్పంచ్ గుణగంటి అలివేలు అధికారులను కోరారు.