ఖైరతాబాద్ వినాయకుడు.. త్రిశక్తి సమేత గణనాథుడు

TG: వినాయకచవితికి HYD ఖైరతాబాద్‌లో పెట్టే గణేశుడి విగ్రహం ఎంతో ప్రత్యేకం. ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిశక్తి సమేతుడిగా తీర్చిదిద్దారు. భూగోళం, దానిపైన 3తలలతో త్రిశక్తి సమేతుడిగా, 5పడగల నాగసర్పం కింద గణనాథుడు ఉండేలా రూపొందించినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.