బాలికల విద్యను ప్రోత్సహించాలి: కలెక్టర్

బాలికల విద్యను ప్రోత్సహించాలి: కలెక్టర్

NLG: బాలిక విద్యను ప్రోత్సహించడమే బాల్యవివాహాలను అరికట్టేందుకు పరిష్కారమని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలో "ఆశ్రిత" స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ శాఖ సహకారంతో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జాగ్రత్త పేరుతో రూపొందించిన బాల్య వివాహాల విముక్తి ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు.