KUలో ఈ నెల 15 నుంచి ముఖ గుర్తింపు హాజరు అమలు
WGL: కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) క్యాంపస్‌లో డిసెంబర్ 15 నుంచి ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని పక్కాగా అమలు చేస్తామని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం ఇవాళ ప్రకటించారు. మొదటి విడతగా క్యాంపస్ కళాశాల, దూరవిద్య కేంద్రం, ఫార్మసీ, కో ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ కళాశాల, పరీక్షల విభాగం, హాస్టల్స్, కార్యాలయ ఉద్యోగులకు ఈ విధానం వర్తిస్తుందని తెలిపారు.