బీసీ స్టడీ సర్కిల్లో సర్టిఫికెట్ల పరిశీలన

KNR: కరీంనగర్ BC స్టడీ సర్కిల్లో RRB, SSC, బ్యాంకింగ్, గ్రూప్స్ ఉచిత శిక్షణ కోసం 652 మంది దరఖాస్తు చేసుకున్నారని KNR BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. వీరిలో ఇంటర్, డిగ్రీలో మెరిట్ ఆధారంగా 100 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈరోజు నుంచి స్టడీ సర్కిల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు.