జోరు వానలో రైతన్న కష్టం

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో గురువారం ఓ రైతు తన గ్రామానికి యూరియా సంచిని తరలిస్తుండగా అకస్మాత్తుగా జోరుగా వర్షం కురిసింది. దీంతో రైతు 44వ జాతీయ రహదారిపై ఆటో కోసం ఎదురుచూస్తూ.. తలపై 50 కేజీల బరువు మోస్తూ, గొడుగు పెట్టుకుని ఎదురు చూశాడు. రైతుకు ఎన్ని కష్టాలు అంటూ స్థానికులు చర్చించుకున్నారు.