పెద్దేముల్ అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ
VKB: పెద్దేముల్ మండల కేంద్రంలో ఉన్న 108 అంబులెన్స్ను వికారాబాద్ జిల్లా కోఆర్డినేటర్ రఘురామ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా వాహనంలోని రికార్డులను, మందులను, సిబ్బంది పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటి సంజీవ్ పైలట్ నర్సింహులు పాల్గొన్నారు.