IND-A vs SA-A: నేడే చివరి వన్డే
భారత్-A, సౌతాఫ్రికా-A జట్ల మధ్య చివరి అనధికారిక వన్డే ఇవాళ రాజ్‌కోట్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ చివరి వన్డేలో కూడా గెలిచి, మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ పట్టుదలతో ఉంది. మరోవైపు, సౌతాఫ్రికా-A ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి, తమ పర్యటనను విజయంతో ముగించాలని భావిస్తోంది.