ఎల్ఎండి నుంచి ఆయకట్టుకు ముగిసిన నీటిపారుదల
KNR: ఎల్ఎండీ నుంచి ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో సుమారు 7టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో తాగునీటి అవసరాల కోసం నిల్వ ఉంచినట్లు అధికారులు తెలిపారు. అయితే కాకతీయ కాలువ ఆధారంగా సాగవుతున్న వరి పంటలు ఇంకా కోత దశకు చేరలేదు. మరో వారం రోజులు తడులు అందిస్తే పంటలు చేతికందుతాయని రైతులు చెబుతున్నారు.