మెగా డీఎస్సీ అభ్యర్థులకు కీలక UPDATE

AP: మెగా డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. రాత పరీక్షలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేస్తారు. మార్కుల సవరణకు ఈ నెల 17 వరకు అవకాశం ఇచ్చారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి, అనంతరం స్కోర్ కార్డులను విడుదల చేశారు.