'ఫీజుల పేరుతో విద్యార్థులపై వేధింపులు ఆపాలి'
WNP: ప్రైవేటు విద్యాసంస్థల యజమాన్యాలు ఫీజుల పేరుతో విద్యార్థులను వేధించడం మానుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అర్జున్ సాతర్ల హెచ్చరించారు. జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను అవమానించడం, పరీక్షలకు అనుమతించకపోవడం,క్లాస్ రూమ్ నుంచి బయటకు పంపించడం తదితర వేధింపులు శోచనీయమన్నారు.