ఐకేపీ కేంద్రంలో వడ్ల కోత.. రైతుల ఆగ్రహం
SRPT: చివ్వెంల మండలం చందుపట్ల ఐకేపీ సెంటర్‌లో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని రైతులు మండిపడ్డారు. లారీకి 20 క్వింటాళ్ల వరకు కోత విధించారని ఈరోజు ఏపీఎం వెంకయ్యకు వినతిపత్రం ఇచ్చారు. అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి, తమ ఖాతాల్లో పూర్తి డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.