కర్మ ఎవరినీ వదలదు.. బర్రెలక్క సంచలన వీడియో

TG: బర్రెలక్క అలియాస్ శిరీష సంచలన వీడియో విడుదల చేసింది. తనపై వస్తున్న ట్రోల్స్‌పై కంటతడి పెట్టుకుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి తనపై ట్రోల్స్ వస్తున్నాయని తెలిపింది. తనకు పెళ్లిపై ఆసక్తి లేకపోయినా ట్రోల్స్‌కి భయపడే వివాహం చేసుకున్నట్లు చెప్పింది. 'నేను ఏం తప్పు చేశాను' అంటూ ప్రశ్నించిన ఆమె.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని ఆవేదన వ్యక్తం చేసింది.