నవంబర్‌లోనే తాటి ముంజల సీజన్ ప్రారంభం
విశాఖ: సాధారణంగా ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే తాటి ముంజల సీజన్ ఈసారి నవంబర్‌లోనే ప్రారంభమైంది. విశాఖ భీమిలి బీచ్ రోడ్డులో సీతకొండ దగ్గర తాటి ముంజలు విక్రయిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చి డజన్ రూ.100కు అమ్ముతున్నారు. ఎండాకాలం కాకుండా నవంబర్‌లోనే తాటి ముంజలు రావడం జనాల్లో ఆసక్తి రేపుతోంది. కొందరు ఇది వాతావరణ మార్పుల ప్రభావమేమోనని అంటున్నారు.