అంబటివలసలో కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ

అంబటివలసలో కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ

VZM: బొండపల్లి మండలంలోని అంబటి వలస గ్రామంలో శుక్రవారం నూతన పాస్ పుస్తకాలను రైతులకు విజయనగరం రెవిన్యూ డివిజనల్ అధికారి దాట్ల కీర్తి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో ముద్రించిన పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ డోల రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.