లారీని అడ్డుగా పెట్టి రాస్తారోకో చేపట్టిన రైతులు
SRCL: ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధాన్యం లోడుతో ఉన్న లారీని కామారెడ్డి - సిరిసిల్ల ప్రధాన రహదారిపై అడ్డుగా పెట్టి రైతులు ఇవాళ రాస్తారోకో చేపట్టారు. మండలంలోని వెంకటాపూర్ రైతులు 7 రోజుల కిందట తూకం వేసి రైస్ మిల్లుకు తరలించారు. ధాన్యం తేమ శాతం అధికంగా ఉన్నదని 15 క్వింటాళ్ల ధాన్యం కోత విధిస్తామని పేర్కొనడంతో రైతులు ఆగ్రహించారు.