'బీసీలపై అగ్రవర్ణాల కుట్రలు తగవు'
మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి ఎస్సీలకు కేటాయించాలని బీసీ జాక్ డిమాండ్ చేసింది. బీసీజేఏసీ నేత సారంగి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. బీసీల అభివృద్ధి మా లక్ష్యమని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల సామాజిక సమతుల్యత పాటించాలన్నారు. తమ స్వలాభం కొరకు బీసీలను ధనార్జన ధ్యేయంగా అగ్రవర్ణ రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని వెల్లడించారు.